తొలి ఏకాదశి
తేది: 01-07-2020
శీర్షిక: తొలి పండగ...
సంఖ్య: 455
దక్షిణాయన పూర్వారంభం
విష్ణుమూర్తి శయనేకాదశిగా
ఆధ్యాత్మికతకు ఆలవాలమైన
తొలి పండగ ఏకాదశి ఈ మాసమునే.....
నమ్మకమైన నగ్నసత్యం
విశ్వం కన్ను తెరవకముందేశాస్త్రీయతలను సంప్రదాయాలుగ
మలుచుకున్న స్వర్ణ భారతీయం....
గ్రీష్మం దాటుకుని వర్షఋతువేతెంచ
తొలకరి మెరుపు జల్లులతో ఒళ్ళంతా
పులకరించిన ప్రకృతి పచ్చకోక చుట్టుకున్న
పడుచు ముత్తైదువయి నిలుచు......
పరవశించిన ప్రకృతమ్మ కొమ్మ రెమ్మల
కొత్త అందాలను సంతరించుకుని
కోటి ఆశల ఎదురుచూపుల జీవరాశికి
ఆనందాల పరవశాలను అందిస్తుంది....
రాత్రులు పెరిగి దినములు తరగ
అలసత్వములు పెరిగి జాడ్యమావరించ
పంచేంద్రియాలు జ్ఞానేంద్రియాలు
పరమ విశిష్టమే అనుసంధాన పరచ....
చాతుర్మాస వ్రతములు కొంత
చకిత చురుకుదనములు చేర్చటంచు
మనిషి మనుగడలోన కోరి ఏర్పరచిరి
విజ్ఞులు కొంగు బంగారు చేయ .....
నగునూరి రాజన్న
కరినగరము.
No comments:
Post a Comment