స్మారక కేంద్రాలు
తేది: 25-05-2020
శీర్షిక: నమో నమామి!
సంఖ్య: 427
పుట్టుక చావులను పుణికి పుచ్చుకుని
ధన మాన ప్రాణాలను ధారాదత్తంగా
జీవితం మెత్తాన్ని జన హితం చేయగలిగిన
ధాతృత్వాలకు ధనికమైన దేశం నాది!
అనుక్షణం అలోచించి శ్వాసించినా
దేశభక్తియే ప్రాణంగా ప్రేమించినా
నలుగురు మెచ్చ నడయాడిన
అహింసావాదులో మితవాదులో
అతివాదులో అందరూ దేశభక్తులే... !
భూతకాలపు చిహ్నాలుగా
గర్వకారణ సేవల గుర్తింపుగా
ముందుతరాలకు స్ఫూర్తిగా
చరిత్రలకు ఆధారమయ్యే
చర్విత చరణాలకు మైలు రాళ్లు!
విజయ తీరాల వింత చిహ్నాలయినా
శాస్త్ర సాంకేతికతల సౌలభ్య సంగమ
పరిశోధనా కేంద్రాల ఆనవాళ్లయినా
అమర సైనికుల సేవల ఆధునిక
దేవాలయాలైనా అన్నీ స్మారక కేంద్రాలే....!
కలికి తురాయిలు నాదేశ కీర్తి పతాకాలు
నమ:సుమాంజలులు నమోనమామి!
నగునూరి రాజన్న
కరీంనగరు.
No comments:
Post a Comment