సమానత్వపు జాడలు
తేది: 11-06-2020
శీర్షిక: రాజకీయ నీలి నీడలు
సంఖ్య: 439
కండలు పిండిచేసి రక్తాన్ని రంగరించి
కసిగా చమట చుక్కలను పిండుకున్నా
కందకాలలో కాలువలై పారుతున్నా
కనుచూపు మేరలో కానరాకున్నది ....!
అరుణిమైన ఆకాశపు కరుణకు ఆర్తిగా
కసిగా చమట చుక్కలను పిండుకున్నా
కందకాలలో కాలువలై పారుతున్నా
కనుచూపు మేరలో కానరాకున్నది ....!
అరుణిమైన ఆకాశపు కరుణకు ఆర్తిగా
కళ్ళల్లో వత్తులేసుకుని కాశపూసి
కాడెద్దులే జీవితంగ కర్రు నాగలే
ప్రపంచంగా భూమి పొక్కిలి చేసినా
కరుణించని కానరాని పరిస్థితులే...!
కాడెద్దులే జీవితంగ కర్రు నాగలే
ప్రపంచంగా భూమి పొక్కిలి చేసినా
కరుణించని కానరాని పరిస్థితులే...!
దుమ్ము బుక్కి ధూళి పీల్చి
పొగ గొట్టాలతో పోటీపడి పోరుసల్పి
పొగ గొట్టాలతో పోటీపడి పోరుసల్పి
పొట్టకూటికై పొర్లాడినా బొక్కబోర్లా పడుడే
కాని లెక్కలోకి వచ్చిన జాడలే కానరావు....!
ఇరవై ఒక్కటైనా ఇనుమడించలేదు
దెబ్బదెండ్లయినా ఇబ్బందులేనాయే
ఖద్దరు చొక్కాలకు దక్కిన కదరు కూడా
కరువాయే కష్టజీవులకు విలువలేక.....
దెబ్బదెండ్లయినా ఇబ్బందులేనాయే
ఖద్దరు చొక్కాలకు దక్కిన కదరు కూడా
కరువాయే కష్టజీవులకు విలువలేక.....
పేర్లు మారిన పెద్దరికాల ముచ్చట
యుగాలు దాటినా యుక్తి కలిగినోనికే
రంకు నేర్చిన రాజకీయ నీడల ముందు
రంగులు మార్చుకున్నా రాజాలదు పేదోని
యుగాలు దాటినా యుక్తి కలిగినోనికే
రంకు నేర్చిన రాజకీయ నీడల ముందు
రంగులు మార్చుకున్నా రాజాలదు పేదోని
వాకిట్లోకి....
నగునూరి రాజన్న
కరినగరము.
No comments:
Post a Comment