Wednesday, June 3, 2020

నిప్పుల కొలిమెక్కిన దేవ దూతలు (కరోనా కవిత ) 12

నగునూరి రాజన్న
కరీంనగర్

శీర్షిక: నిప్పుల కొలిమెక్కిన దేవ దూతలు

కంటికి కానరాని కరోనా క్షిపణి కన్నా   
వేగంగా చిత్తు చిత్తుగా విస్తరించి 
చిందర వందర చేస్తుంటే....! 

గడప దాటి రాకంటు పబ్బతి 
పట్టిన పాలకులు... పాణాలను 
ఫణంగా పెట్టి పరుగు తీస్తున్న అధికారులు! 

అమ్మలా బుజ్జగిస్తూ నాన్నలా  
మందలిస్తూ అడుగడుగున 
అడ్డుపడుతూ కంటికి రెప్పలైన ఖాకీ వనాలు! 

మానవత్వాన్ని నెత్తికెత్తుకుని 
మనల్నికాపాడే పనిలో 
పడ్డ ధన్వంతరి వారసులైన 
ధవళకాంతి దేవదూతలు. 

ఆదమరువక సేవలందిస్తూ 
అందరి మన్ననలు పొందె ఈనాడు!
అవని శుభ్రత దూతలు. 

అహోరాత్రులు శ్రమిస్తూ అవని అంచుల 
సంచరిస్తూ ఆరా దీసి కలబోతలను 
అక్షరీకరించె పాత్రికేయులు! 

నీకొరకు నాకొరకు నిప్పుల కొలిమెక్కినారు
నిజమైన దేవుండ్లు నమ్ము సోదరా!

కనపడని క్రిమికోసం కత్తిమీద సాములా 
కవాతు చేస్తున్నారు కదిలిరా సోదరా!

పుట్టిన ప్రతివారికి మరణం తథ్యమైనా....
 అనాథ మరణాలను అడ్డుకుందాం సోదరా!

స్వీయ నియంత్రణలు పాటిద్దాం 
సురక్షిత జీవనం గడుపుదాం 
సదా పొరుగు క్షేమం కోరుదాం! 

నగునూరి రాజన్న 
కరీంనగరు.

No comments:

Post a Comment