Sunday, July 12, 2020

ఆకు కదలని చోట తేది: 25-06-2020

ఆకు కదలని చోట
తేది: 25-06-2020
శీర్షిక : మానవ తప్పిదం... 
సంఖ్య : 450

ఉరిమి ఉరిమి మంగళం 
మీద పడితే ఎలా ? 
పనులన్నీ నీవి ప్రశ్నలన్నీ నాకా....  
నన్నాడిపోసుకుంటే ఎలా ?

పట్టణీకరణతో యాంత్రీకరణతో 
ప్రకృతినుండి పారిపోయి  సాటి
మనుషులను కూడా మరిచి పోయి 
దారితప్పి మెల్ల మెల్లగా డబ్బుల మద్య 
తిరుగుతూ వస్తువుల మీద మోజుతో 
ఒక్కొక్కటిగా పోగేసుకుంటున్నావు.... 

నా కదలికే మనుగడకు ఉనికి... 
మరిచానో  మీ చావో రేవో 
మొరాయించానో బతుకు జీవుడా 
జీవకోటి హరాయింపులే....

నేను కదలని చోట అనామకమే
పచ్చదనాలకు నిలువని వెచ్చదనం
పవన వీవనలకు నెలవు లేక
జీవనాదాలకు జత కూడని జీవం ....

నేను కదిలితేనే ప్రకృతి పల్లవించేది 
ప్రకృతంటేనే పంచభూతముల పరిక్రమ
పరిక్రమ తోనే ప్రాణ మూకలు... లేదంటే
విశ్వము జీవకోటి ప్రశ్నార్థకమే ..... ?
కళ్ళు తెరువు కాలం వృదా చేయకు... 


నగునూరి రాజన్న
కరినగరము. 

No comments:

Post a Comment