Thursday, July 9, 2020

ఆలన పాలన : 12-05-2020

ఆలన పాలన 
తేది: 12-05-2020
శీర్షిక: స్వయంచలిత సంజాత
సంఖ్య: 416 

యాదృఛ్చికమేమి కాదు 
స్వయంచలిత సంజాత
అమ్మానాన్నలకు పిల్లలన్న
అంతర్నిర్మిత అయాచితం....

గురువు నేర్పిన విద్యేమీ కాదు 
ప్రశాంత జీవన విధానాల్లో 
పల్లె వాతావరణాల్లో ఫరిడవిల్లిన
ఆత్మీయతల అమ్ములపొది..... 

బలవంతం ఏమి లేదు కాని
బతుకు పరుగుల జీవితాలే 
పట్నవాసపు వాయువేగాలే
పట్టాలు తప్పిస్తున్న వైనం.... 

కలుషితాల కాల మహిమలలో
కలి కాలపు జీవితాలలో
కాసులపంటల పరుగులలో 
కాల పరీక్షకు ఎదురీదుతున్నది.... 

అమ్మానాన్నలచే అనుభవించిన 
అపురూపమైన ఆలన పాలనలను
ఆచరిద్దాం అమ్మానాన్నలకందించి 
ఆత్మీయతతో అవసానదశలో .... 

ముగ్దంగా సాగుదాం  
ముందుతరాలకు అందిద్దాం 
మార్గదర్శకంగా నిలుద్దాం ..... 

నగునూరి రాజన్న
హైదరాబాదు. 

No comments:

Post a Comment