Sunday, July 12, 2020

మహా సంకల్పం తేది: 22-06-2020

మహా సంకల్పం
తేది: 22-06-2020
శీర్షిక: సంఘ శ్రేయస్సు కోసం.... 
సంఖ్య: 447

అనంతకోటి జీవరాశిలో లేని
అంతు తెలియని అజరామరమైన
అనన్యమైన మేథో సంపత్తి
ఒక్క మనిషికే స్వంతం....

మంచికైనా చెడుకైనా మానవ
మనోఫలకంపై ముద్రించుకునే
ఆలోచనా అలల తరంగాల
అంకుర సముదాయమే సంకల్పం ....

ఆలోచనలు అల్లుకున్న 
సంకల్పం గొప్పదైనా అందరికి 
చేరకపోతే అంకురం లోనే 
అడ్డుపడుతుంది ఆపదలెదురౌతాయి...

చిన్నదైనా పెద్దదైనా నలుగురి కోసం 
సద్భావనల నిధులతో 
సంక్షేమాల మాలలతో  
సన్నుతిస్తేనే సంఘ శ్రేయస్సు పురోగతి.... 

ఆశల గమ్యానికి ఆశయాల సాధనకు 
పట్టుదల దీక్షలే పెట్టుబడిగ 
అడుగు ముందుకు వేస్తే
అనంత విశ్వంలో సాధించనిదంటూ
ఏదీ ఉండదు.... 

నగునూరి రాజన్న
కరినగరము 

No comments:

Post a Comment