కుటుంబ సమ్మేళనం
తేదీ: 15 /05 /2020
శీర్షిక : భారతీయతకు భవంతి.
సంఖ్య: 419
భారతీయ సంస్కృతి
భవంతికి పునాది రాయి...
విశ్వం కళ్లుతెరవకముందే
అవిభాజ్యాలతో అలరారింది.....
రక రకాల రక్త సంబంధాలన్నీ
రుధిర సంబంధ నారాయణ లీలలు
తాతలు ముత్తాతలు మొదలుకుని
మనుమలు మనుమరాండ్ర వరకు....
ఆత్మీయానందాలతో అలరారేది
ఆపద సంపదలకు ఆదుకునేది
కష్ట నష్టాలను సుఖదుఃఖాలను
కలిసిపంచుకునే నిండుపండగ....
కులమతాల కుత్చితాలెన్నున్నా
వర్గోపవర్గ వర్ణణాలెన్నున్నా
వసుధైక కుటుంబమే
మన దేశ సాంప్రదాయం
ఆనకట్టలో చేరిన పూడికలా
అక్కడక్కడా అల్పుల ఆగడాలకు
అదిరినా చెదరని ప్రకృతి పూదోట
అలుపు తీర్చుకుని సేదదీరే వటవృక్షం ....
కరీంనగరు.
No comments:
Post a Comment