ఊపిరాడనివ్వని క్షణాలు.
తేది: 19-06-2020
శీర్షిక: ఆపదల్లోనే.....
సంఖ్య: 446
ధర్మం ఒక్క పాదమంటేనే
నిర్మలంగా లేని బతుకులు
అది కూడా కుంటుతుంటే
అవతలి తీరం చేరేదెట్లా ?
కలికాలమంటే కామ్రేడ్లు కూడా
కపటనీతుల కలబడుతారేమో
బహురూపాల బతుకు జీవిని
బలాదూరుగ ఓ పక్క విసిరేసి....
నిర్మలంగా లేని బతుకులు
అది కూడా కుంటుతుంటే
అవతలి తీరం చేరేదెట్లా ?
సంతోషాలకు దుఃఖాలకు
సమపాళ్లంటే సరిపోతుందా?
సంతోషం సగం బలాన్నిస్తే
దుఃఖం ఆగమ్య గోచరం చేసి
అశనిపాతం మిగుల్చుతుంది......
స్వాతంత్ర్యాల సమరోత్సాహం
అంబరాన్నంటే సంబరంకంటే
రజాకార్ల అరాచకాలే పిల్లా పాపలను
ఊపిరాడనివ్వని క్షణాలు ఆనాడు...
కలికాలమంటే కామ్రేడ్లు కూడా
కపటనీతుల కలబడుతారేమో
బహురూపాల బతుకు జీవిని
బలాదూరుగ ఓ పక్క విసిరేసి....
అరువదేడులోనే అణిగిమణిగిన డ్రాగన్
అదను చూసి ఆపద సమయంలో
పక్కలో బళ్ళెంలా కాలు దువ్వుతూ
పంతంపట్టి మట్టుబెడుతున్నది
పదులలో మన సైన్యాన్ని పకడ్బందీగా....
నగునూరి రాజన్న
కరినగరము.
No comments:
Post a Comment