ఒకే గూటి పక్షులు
తేది: 15-06-2020
శీర్షిక: అన్నీ ఆ తాను ముక్కలే...
సంఖ్య : 442
అధికార పక్షంలో ఊరేగినా
ప్రతిపక్షంలో పాకులాడినా
ప్రతిపక్షంలో పాకులాడినా
ప్రణాళికల లెక్కల్లో కక్కుర్తిలే
ప్రాజెక్టుల ప్రసాదాలకే గాని
ప్రజా క్షేమాల పట్ల పక్షపాతమే
పాలకుల శ్వాసలు ఊసులు ....
ప్రజా క్షేమాల పట్ల పక్షపాతమే
పాలకుల శ్వాసలు ఊసులు ....
నిరుద్యోగాల కాలాన నిర్వచనాల
ప్రవచనాలొలకబోసి సిద్దాంతాల
మర్మాల సిత్రాలు చూపిస్తూ
ఉద్యోగం దొరికేదాకా ఊరంతా క్షేమం
ఒక్కసారి దొరికిందా బల్ల మీదా.... కిందా .....
జమలేసుకుంటూ కన్ను మిన్నూ కానని
అధికార గణం ప్రజా క్షామమే పరమావదంటూ
పాత కొత్త తరం అంతా ఆ గూటి పక్షులే...
కలి కాలం సాక్ష్యంగా
కల్మషాల గింజలేరుకుంటూ
కపట నీతుల తేనెలు గ్రోలుచూ
కాని పనులే కామిత ఫలదాయనిగా
కామ్రేడునంటూనే మన శత్రువుతో
కలిసి కవ్విస్తున్న కరటక చైనా....
కలి కాలం సాక్ష్యంగా
కల్మషాల గింజలేరుకుంటూ
కపట నీతుల తేనెలు గ్రోలుచూ
కాని పనులే కామిత ఫలదాయనిగా
కామ్రేడునంటూనే మన శత్రువుతో
కలిసి కవ్విస్తున్న కరటక చైనా....
నగునూరి రాజన్న
కరినగరము.
No comments:
Post a Comment