Thursday, July 9, 2020

చెవిలో రహస్యం 23-05-2020

చెవిలో రహస్యం
23-05-2020
శీర్షిక: నోరు దాటితే.... 
సంఖ్య: 426

గురువు శిష్యునికందించేది 
గురుతరమై జీవితాన నిలిచేది 
భక్తికి అదియే మూలమంత్రం 
ముక్తికి సుగమ మార్గదర్శనం .... 

కొన్ని విజ్ఞాన వీచికలౌతే
మరికొన్ని నగ్న సత్యలౌతాయి 
కొన్ని తెలుసుకుంటే మంచిది 
మరి కొన్ని వదిలిపెడితే ఆనందం....

మాటైనా మంత్రమైనా 
నోరు దాటితే ఊరు దాటుతుందంటారు 
అధికారికమైనవి అనధికారకమైనవి 
అందలాలు ఎక్కించనూ వచ్చు
అపశృతులనాహ్వానించనూ వచ్చు..... 

కొన్ని సందర్భాలలో భద్రతలనిచ్చి
బతుక్కు బంగారం అద్దితే 
మరికొన్ని అభద్రతలకు మూలమై 
బతుకు అతలాకుతలం చేస్తాయి..... 

కష్టాలు సుఖాలు కాల పరీక్షలు 
అందరికీ... అతీతులెవ్వరు కాదు  
మనసున చేరిన నీలి నీడల చాయలు
పంచుకుంటేనే సాంద్రత పలచనౌను... 
వంచన చేయని మంచి మిత్రుడే సౌఖ్యం... 


నగునూరి రాజన్న
కరీంనగరు.  


No comments:

Post a Comment