వెలుతురు కొలను
తేది: 21-05-2020
శీర్షిక: అక్షర జ్ఞాన దివిటీలు...
సంఖ్య: 424
అమావాస్య గ్రహణపు
నాటి పాలనల చీకటి రోజుల్లో
అలితేరిన అమ్మానాన్నలు
అలుపులేని మా జీవితాల
ఆనందాల బంగారు భవిష్యత్తుకై....
అక్షర జ్ఞాన దివిటీలను
అందింపజేసి వెలుతురు
కొలను వైపు అడుగులేయించారు...
ప్రకృతి కాంత ఒడిలో ఓలలాడే
పచ్చని చెట్ల కొమ్మల మాటునుండి
వెచ్చని కిరణాలను ప్రసరింప చేస్తూ
లేలేత భానుడు తొలిసంధ్యలో
గరిక పూలవనంపై ప్రకృతి మాత
పేర్చుకున్న మంచు ముత్యాలను
ఒక్కొక్కటిగా ఏరుకుంటూ మాయం చేస్తున్న
తరుణాన ఉదయాత్పూర్వమే లేపి
ఆ పూట చదువులు వల్లె వేయించేది....
మలి సంధ్యల సమయాలలో
ఆనాటి వ్రాత పనులు పూర్తి చేయించేది.....
మొత్తంగా మా జీవితాలలో
జ్ఞాన జ్యోతులకు బీజం వేసారు....
నగునూరి రాజన్న
కరీంనగరు.
No comments:
Post a Comment