Sunday, July 12, 2020

ఇంత దూరం నడిచాక తేది : 26-06-2020

ఇంత దూరం నడిచాక
తేది : 26-06-2020
శీర్షిక : మారని వక్రమార్గం...
సంఖ్య : 451

కోట్ల సంవత్సరాల చరిత్రలు
కొట్టుకొని చచ్చిన కోలాటాలు
నాకు నాది అన్న వదలని స్వార్థాలు
నవ నాగరికతలంటు భ్రమలు ....

తూర్పు పశ్చిమాలంటూ తమాషాలు
ఏదైనా బ్రతుకు గమ్యమే పాఠాలు
తాతలు నేతులు తాగారనే తలపులు
తలమాసిన చిరునామాల బతుకులు...

యుగాలు మారిపోయినయి - విన్నాం
తరాలు మారుతున్నాయి - చూస్తున్నాం
వంశ పారంపర్యాలు నశిస్తున్నాయి
కొల్లగొట్టి కొల్లాయితో దేశాలు మారుతున్నరు...

ఎక్కడ చూసినా ఏమున్నది గర్వకారణం
విజ్ఞుడు చెప్పిన వాస్తవమే సమస్త మానవ
చరితం పరపీడన పరాయణత్వం
అయినా మారని ఈనాటి నాయకత్వం....

ఇంత దూరం నడిచినా... రాజకీయం
ఇంగితాలు పెంచుకోని పాలకవర్గం
ఇంపైన బతుకు మార్గం ఎంచుకోక
అదే జీవిత పరమార్థమైన వక్రమార్గం.... 

నగునూరి రాజన్న
కరినగరము. 



No comments:

Post a Comment