Sunday, July 12, 2020

నగరం నిద్రపోదు తేది: 17-06-2020

నగరం నిద్రపోదు 
తేది: 17-06-2020
శీర్షిక: నగరం నద్రెట్లా పోతుంది? 
సంఖ్య : 444

ఎవుసమంటేనే కుబుసమనుకుని 
ఎదుగుదలకై పట్నబాటలంటూ
పల్లె జేబుల చిల్లు భ్రమలతో వస్తున్న
వలస పక్షుల్ని అక్కున చేర్చుకుంటున్న
వట వృక్షాలు మన నగరాలు..... 

చెట్లు చేమల్లేని బోసి నగరం 
చిమ్మట్ల రోదల్లేని నిశి జోలరాగం 
విరామమెరుగని వింతజీవి వాహనం
విసుగు చెందని మనిషి జీవన పయనం 
నిశి చీకట్లను చీల్చే నియాన్లమయం ... 

ఖద్దరు నీడన కండలు పెంచే
కార్పొరేట్ సంస్కృతి వనాలలో
పడిలేచిన కెరటంలా ప్రతి జంట 
పగలు రాత్రుల తేడాలు మరిస్తేనే 
పట్టెడన్నం పొట్ట నిండని వైనం... 

యంత్రాల బొంగురు గొంతుల జీరల్లో 
వాహనాల హారన్లు చక్రాల రొదల్లో 
వంతుల వారీగా వాటాలు వేసుకుని
తంతుల బ్రతుకులు వెళ్లదీస్తున్న 
భజంత్రీల ప్రజలకు కంటిమీద 
కునుకెట్లా వస్తుంది? కంటినిండా  
నగరం నిద్రెట్లా  పోతుంది ? 

సాయంసంధ్యా సమయం లోనే 
రేపటి పనుల జాబితాల
ఒత్తిడి తరుముతుంటే నగరం
సజావుగా నిద్రెట్లా పోతుంది.... 


నగునూరి రాజన్న
కరినగరము. 

No comments:

Post a Comment