Thursday, July 9, 2020

నవ్వుతూ బతకాలిరా ......05-05-20

నవ్వుతూ బతకాలిరా 
తేది 05 -05 -2020 
శీర్షిక : లోకో భిన్న రుచి... 
సంఖ్య: 410 

మానవత్వపు పరిమళాలు 
మన చుట్టూ గుబాళిస్తే 
మనిషికి అంతకన్నా ఏంకావాలి ? 
నవ్వుతూ బతికేయొచ్చు....! 

అమృత తుల్యపు భవ బంధాల 
ఆత్మీయతల అనుబంధాల లతలు 
అనితరమై అల్లుకుంటుంటే అంతకన్నా 
కావాల్సిందేముంది మనిషికి ? 
నవ్వేస్తూ బతికేయొచ్చు...! 

అడగక ముందే అన్నీ ఇచ్చే 
ఆదిదేవుడే ఎదురొచ్చి అవసరాలు తీర్చితే 
ఆదమరిచి కష్ట కాలాలను దాటి
ఆనందంగా బతికేయొచ్చు .....! 

కదులుతున్న కాలప్రవాహంలో 
ఎదురొస్తున్న అదృష్టంలా 
అన్నీ ఆలా అమిరిపోతూంటే 
నవ్వుతూ బతికేయొచ్చు....! 

కానీ.... 
కొందరికి గతం జీవితమైతే 
కొందరికి వర్తమానం మాత్రమే
ఇంకొందరికైతే అన్నీ వదులుకున్న 
భవిష్యత్తే  భావి జీవితం..... !
లోకో భిన్న రుచి.... 

నగునూరి రాజన్న
హైదరాబాదు. 

No comments:

Post a Comment