భాషలెన్నయినా భావమొక్కటే ....
తేది: 23-02-2022
శీర్షిక : వారధి
కవిత సంఖ్య : 225
జీవరాశిలో మానవాళిని
వేరుగా చూపింది మన మస్తిష్కము .....
లక్షల కోట్ల ఆలోచనలను
లక్షణంగా ఏకరువు పెట్టగల భాషతో ....
విజ్ఞానాల బాట నడవాడినికి
వింతగా ప్రాంతాలన్నీ కలవడానికి
వినూతనంగా వలసలు కదిలి
విశ్వమంతా ఒక్కటని చెప్పడానికి .....
భాష ఏదైనా భావ పరంపరలు
చేరవేసే సారధి... మనుషులమధ్య ....
చరిత్రల పుటల్లో నిక్షిప్తమై
వారధిలా నిలుచు తరాల మధ్య .....
ఏభాషైనా ...ఎదురు లేనిదౌతుంది ...
పాలకుల పరితపనల దన్ను
తోడై ...ప్రజల మన్ననలు పొందితే .... .
పదికాలాలు నిలువడానికి .....
వేల భాషలు వెలుగులీనుతున్నా
ప్రపంచాన పదిహేనవ భాషగా
పదిలమయినది మన తెలుగు
మల్లె పరిమళాలు వెదజల్లుచూ .....
నగునూరి రాజన్న
కరినగరము
No comments:
Post a Comment