జలమే ఆధారం
తేది: 22-03-2022
శీర్షిక : మూట విలువకన్నా గొప్పది ....
కవిత సంఖ్య : 874
నాగరికతలకు నాందీ పలికిన
నదీమతల్లులకు ప్రణామం .....
జలమేరా జగతికి ఆధారం
జలం విలువ తెలుసుకొనుట
మానవాళి ప్రాథమిక ధర్మం...
విశ్వంలో ... దేహంలో ....
మూడింట రెండొంతుల నీటితో
ముచ్చటగా తెలియజేసే ప్రకృతి
జీవరాశికి నిత్య ప్రాణాధారమని ....
పచ్చదనాలకు మూలమై
తరువు ... చెరువులకు ఆధారం ...
తాగునీరు సాగునీరుగా
ప్రత్యక్షంగా ... పరోక్షంగా ...
జీవరాశి మనుగడకు మూలం ...
నిరక్షరాస్యతలో ... నిర్లిప్తతలో ...
నదులను కలుషితాల కాసారాలుగ
కష్టపడి పెంచి పోషిస్తున్నారు
పట్టని ప్రజలు ... ప్రభుత్వాలు ....
అవగాహనలు పెంచాలి
ఆనందాలు పంచాలి
మూటను మించినది నీటి విలువని
నీటుగా చాటాలి గొప్పదని .....
నగునూరి రాజన్న
No comments:
Post a Comment