ఇష్ట కవిత
తేది: 26-03-22
శీర్షిక : విజ్ఞుల మౌనం
కవిత సంఖ్య : 241
అరువదేండ్లు దాటాక గాని
అర్థం కాలేదు... తప్పుదారి
పట్టించారు పాలకులు అధికారులని
ప్రాథమికత నుండే పావులు కదిపి ...
పలుకుబడి లేని పాలకులకు
పట్టం కట్టి ... పంతం పట్టి
తప్పుడు చరిత్రలు చదివించారు
విజ్ఞులంతా మౌనంగా వంత పాడారు ...
నిలకడగా సాగిపోయే నిజాలకన్నా
కాంతిని మించిన వేగంతో చేరిపోయి
వేదికలెక్కి ఉపన్యసిస్తాయి... తిష్టవేస్తాయి...
నిజమేనేమో అనేంత నమ్మకాలను కలిగిస్తూ…
ఉత్తమం అనుకున్న మానవ జన్మ
ఉత్తదేనని అర్థమయ్యింది ... వింతగా
సంపదల చుట్టూ తనుకులాడుతుంటే ....
వెంట రానిది ... వెంట తీసుకుని పోలేనిది ...
విశ్వమంతా ఇదే తంతు
కరటక దమనక నీతులతో
కదలాడుతున్నది లొలకంలా ...
విజ్ఞుల మౌనం విపత్కరమే ఎప్పటికైనా
No comments:
Post a Comment