త్యాగ పరిమళం
తేది 16-03-2022
శీర్షిక : అమ్మతనం ....
కవిత సంఖ్య : 869
మాటలకందని మధురిమ
చేతల్లోన చెక్కుచెదరినిది
అనుభవిస్తే అమితానందం
మల్లె సుగంధాల త్యాగపరిమళం....
అల్లెతాడులా పేగులు మెలిపెట్టి నా
మింగిన మెతుకు... మిగుల వాంతులైనా
కళ్ళు తిరిగి కైలాసం కనపడినా ....
తనువు భారమై తడబడి తండ్లాడినా ....
కండరాలనే పొత్తిళ్లుగా చేసి
కంటికి రెప్పలా కాపాడుకుంటూ
ఒకటి కాదు రెండు కాదు ఏకంగా
తొమ్మిది నెలలు తోడూనీడై నిలబడుతుంది .....
చిన్ని నలకకే చికాకుపడేతత్వాలను
మరిచి ....అణువును పరమాణువుగ చేసి
అండపిండ బ్రహ్మాండమై.. పాపకు జన్మమిస్ తుంది ....
పావనమైన కానుపు మరో జన్మమని తెలిసినా .....
అవనిపైన అడుగిడగానే .....
తనువు రక్తం స్తన్యం చేస్తుంది ...
మలమూత్రములను శుద్ధి చేస్తుంది ...
తల్లడిల్లితే .... తాను కుంగిపోతుంది ....
అమ్మ ప్రేమ అనంతం ...
అసలైన ప్రేమ నిస్స్వార్థం ....
కొలమానం లేనిది అమ్మతనం ....
తరాల వారధిగా .... తనువు చాలిస్తుంది ....
నగునూరి రాజన్న
కరినగరము
No comments:
Post a Comment