Friday, August 5, 2022

జాగరణ తేదీ : 01-03-2022

 జాగరణ 

తేదీ : 01-03-2022
సంఖ్య :  229

అజ్ఞాన తిమిరాల నుండి 
విజ్ఞాన జ్యోతుల వైపు 
శోధన చేస్తూ ఆత్మజ్యోతిని 
వెలిగించ వేసే అడుగుల యాత్ర... 
 
ఆరుగాలం శ్రమించే అరక 
దున్నే రైతున్నకు... పంట ఇంట 
కాలు మోపే వరకు....ప్రకృతి 
వాతావరణ కల్లోలాలతో 
ప్రతిక్షణం పడిగాపుల జాగరణే.......

శివ పార్వతుల చిద్విలాసం 
హిమశిఖరముల కొండ కోనలు.... 
పరివారాలకు పదామడగా 
పంచ ప్రాణాలను పణముగా పెట్టి 
అసువులు ఊసులు ఆవలనెట్టి
ప్రజల సుఖ శాంతులే 
ఉఛ్వాస నిచ్వాసలుగా 
అనుక్షణం ఆచరించే జాగరణే  
పరమ పవిత్ర సైనికుని నిష్ఠ .... 

కాల మార్పుల కనుగుణంగా 
కాయం స్థితిగతుల నిశ్చలతకై 
అపూర్వ అనుభవాల సారంతో 
అచ్చమైన శాస్త్రీయతలను జోడించి 
ఆచారాల సాంప్రదాయాల ప్రోదిగా  
అందించిరి పండగల పబ్బాల పేరుతో
ఆది పూర్వులు మన క్షేమం కోరి ....

మాఘ బహుళ చతుర్దశిన 
మారబోవు కాల సంకేతంగా ...
మన తనువుల సానబెట్టుకొన  
మహాశివుని పేరుమీద 
మనం పాటించే మహాశివరాత్రి జాగరణ ...

నగునూరి రాజన్న 
కరినగరము 

No comments:

Post a Comment