Tuesday, July 12, 2022

అవని అందాలు తేది : 23-02-2022 శీర్షిక : మరకతం

 అవని అందాలు

తేది : 23-02-2022
శీర్షిక : మరకతం 
కవిత సంఖ్య : 96+13

ఉభయ సంధ్యలలోన ఊరేగే 
ఊహా  చిత్రాలు తలుచుకుంటేనే ... 
ఉల్లము జల్లని ఉప్పొంగదా  ... 
ఉల్లాసముతోడ తనువు ఊరేగదా  .... 

భూపాల రాగాన్ని ఆలపిస్తూనే  
భువిని ముద్దాడుతూ ప్రకాశించే... 
వెండి మబ్బుల కొండలపైనుండి 
తొంగి చూచే బాల దినకరుని బంగారు వర్ణం... 

అప్పుడప్పుడే ఒళ్ళు చిలకరించుకుని 
ఆహ్వానములనంపిస్తూ...  ఆడి పాడే 
శుకపికముల కేరింతల కువకువలు ... 
మీనముల మిన్నంటే ఆనంద వర్ణములు .... 

శుద్ధ జలముల మెరియుచూ 
తళతళల జిగినీలు తలంబ్రాలై 
కొండా కొనాలపైనుండి దుముకుచూ  
నిండు తటాకముల చిందేసిన అందాలు .... 

మూడింట రెండొంతుల నీటితో 
పచ్చలు పొదిగిన సుందరం ... 
ప్రకృతి రమణీయతలతో 
ఫరిడవిల్లిన అవని అందం .... 

మరకతమై పచ్చలతో శోభిస్తూ 
మౌనంగా అందాలను  ప్రకాశిస్తూ .... 
జీవరాశికి మానవాళికి  మూలమై 
సంజీవనిగా అలరారింది ఒకనాడు ... 

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment