మదిలో నాటిన మాటలు
తేది : 11-03-2022
శీర్షిక : మమతల మూటలు
కవిత సంఖ్య : 867
మమతలతో నాటుకుంటే
మల్లె సుగంధమై పరిమళించు
ఆశలు నిండిన గమనమై
ఆశయాల గమ్యమై నిలుచు .....
చాలీ చాలని జీవనంలో
చదువులే జీవన జ్యోతులని
అమ్మ వల్లె వేసిన ఆణిముత్యం
మమతల మూటలై మదినిండా
వెలిగించిన మమతల దీపం ...
తోటివారంతా తోడొచ్చింది
పదివరకే ... పలాయనమై
పనులలో మునిగిపోయారు ...
అమ్మ మాటలే అంకురమై
మదిలో మెదలంగా .... పట్నం
తోవ పట్టించి ... పై చదువులకు
మార్గమైనది .....
డెబ్భైలలో పుచ్చుకున్న డిగ్రీ పట్టాకు ....
ఎదురుచూపులెరుగని ఉద్యోగం
ఎదురవ్వగానే ....ఎక్కడలేని
సంతోషం కళ్ళలో కాంతులు
విరజిమ్మింది ....
అమ్మా నాన్నల ఆశయాలకు
అనుగుణమైన నడకలతో
నన్ను నేను నిలబెట్టుకున్న
ఆనందాలకు అవధులు లేవు .....
నగునూరి రాజన్న
కరినగరము
No comments:
Post a Comment