వాలుజడ
తేది : 16-03-22
శీర్షిక : భారతీయత ...
కవిత సంఖ్య : 110+6
కట్టూ బొట్టూ కనికట్టే
భారతాన చెంగల్వపట్టు
సుందరమై విలసిల్లు
చూడ చక్కనైన కేశాలంకరణ
వనితలకెంతో సౌందర్యం
వలపుల కుసుమ బాణం
వాలుజడల సింగారం
చిత్రకారుల చమత్కారం.... సహజసిద్ధమైన సాదా సీదాలైనా
గుంగురుల వంకీల జుట్టులైనా
మహిళామణులకు శోభాయమానం
మగపురుషులకేమో మతి చలింపులు ....
మల్లె పరిమళాలకైనా
ధవన మరువాలకైనా
చిట్టి చామంతులకైనా ...
పడతులకదియే పట్టు కళ ....
ప్రేయసీ ప్రియుల తొలి
ప్రేమలకైనా ... పతి దేవుళ్ళ
ప్రణయ కలాపాలకైనా ....
అందములకు సొబగులద్దు ...
ప్రపంచమంతా ప్రాశస్త్యమైనా
భారతీయతకు పట్టుగొమ్మని
వాలుజడల వయ్యారం .....
పాశ్చాత్యుల ప్రాభవాలతో
భారమాయె నేడది భారతానా గూడ .....
నగునూరి రాజన్న
No comments:
Post a Comment