రమణీయ దృశ్యం
తేది: 24-02-2022
శీర్షిక : ప్రతీ అణువు ......
కవిత సంఖ్య 856
ప్రకృతిలో ప్రతీ అణువు
పరిమళాల రమణీయమే....
ఉభయ సంధ్యలలో వెండి
కొండల మబ్బులపై పయనిస్తూ
దోబూచులాడే దినకరుడు ....
అల్లన వీచే చల్లనిగాలి
నిద్రమత్తులు విదిలించుకున్న
పక్షుల కువకువములు ....
అంబా రవములతో గెంతే
లేగదూడలు ......
శుద్ధ జలము కాంతులు వెదజల్లతూ
తళతళల జిగినీలు తలంబ్రాలై
కొండా కొనాలపైనుండి దుముకుచూ
నిండు తటాకముల చిందేసే అందాలు ....
తరువుల చివరలలో వేలాడుతూ
విశ్వకర్మకు సైతం అంతుచిక్కని
వీర అభియంతం... గిజిగాని
బ్రహ్మాస్త్రం వింతైన పిట్టగూడు ....
దర్శించడమే నయనానందం ....
అవనీమాతపై అల్లుకున్న రంగు
రంగుల పూలు ... ధవళకాంతిలో
మిళితమైన సప్తవర్ణాల వోలె ....
తలుచుకుంటేనే తన్మయత్వం ...
భిన్న రుచుల సమ్మేళనం
ధరణి మాత గుండెల్లో దాగున్న
షడ్రుచులు.... తీపి, పులుపు, కారం,
ఉప్పు, వగరు, చేదు ఆదిగా ......
మననమైతే చాలు ఒప్పొంగు ఛాతీ ...
భిన్నత్వంలో ఏకత్వంగా చాటి
చెప్పే ... పింగళి వెంకయ్య చేత
రూపు దిద్దుకున్న ... భారత జాతి
త్రివర్ణ పతాకం అశోకుని చక్రం .....
సందర్శించ గలిగే మనసుండాలి ....
ఆణువణువూ ఆనందడోలికలే ....
పరవశించే గుండె కావాలి .....
ప్రపంచానా ప్రతీది ఆహ్లాదమే .....
నగునూరి రాజన్న
కరినగరము
No comments:
Post a Comment