అవలోకనం
తేది : 02-03-2022
శీర్షిక : మానవాళి సరళి ...
కవిత సంఖ్య : 230
మంచి చెడుల సంగమం
కష్ట నష్టాల సమాగమం
సుఖ దుఃఖాల సంద్రం
మానవాళి నిత్య జీవనం ....
భూత కాల అనుభవాలన్నీ
వర్తమానాలకు సోపానాలు ....
అవలోకనంలో.... నిన్నటి
తప్పుల కుప్పలకు తప్పని
ఆనవాళ్ల తిప్పలు....మార్గదర్శనం....
అయినా....అప్పుడప్పుడు ....
కపట నాటకీయుల కబంధ హస్తాల్లో
కలిమాయల కైనీడలలో
కమల కోమలమైన మంచితనం
కబలించబడుతూనే ఉన్నది..
తాత్కాలికంగా తప్పులు
తళుకులీని తలపైకెక్కినా...
నీతి నిజాయితీల నిప్పుల
కణికెలే ....శాశ్వత ఛత్రాలు ....
వజ్రోత్సవాల భారతాన
వరుస అవలోకనాలు వల్లె
వేసుకుంటే .... పతనమైన
రాజకీయ నీలినీడల ఛాయలే ....
కాశ్మీరు యుద్దమేఘమైనా ...
తాశ్కెంట్ ఒప్పందమైనా ...
ఆకస్మిక ఆపన్న ప్రధానులైనా...
పలు ప్రముఖుల మరణాలైనా ...
నగునూరి రాజన్న
కరీంనగర్ ....
No comments:
Post a Comment