గేయం
తేదీ 27-03-22
శీర్షిక : నిజం
కవిత సంఖ్య 110+11
నిజం కనుము సోదరా
సత్య మెరుగు మిత్రమా
అతివాదం చేదయితే
జాతి కొరకు ప్రాణాలు
మితవాదం ప్రేమయితే
పాలనల కుర్చీలా ... //నిజము//
అతివాదం తరిమితేనే
పరపతికి తెల్లోడు
పట్టుమని పెట్టాడు
స్వాతంత్య్ర చేతిలో ... //నిజము//
ప్రజలలోన నమ్మికలు
పదుగురిలో సమ్మతులు
పత్తకు లేకున్నా సరే
పాలనెలా సాధ్యం..... //నిజము//
సంస్కృతిపై దాడిచేసి
చదువులన్నీ మార్చారు
నిప్పురవ్వలని తెలిసి
నిజాలన్నీ దాచారు //నిజము//
తప్పుడు చరిత్రలెన్నో
మనచేత చదివించే
తప్పులముందు విజ్ఞులు
మౌనంగా నిలిచారు .... //నిజము//
చాపకింద నీరులా
సౌలభ్యంగ మార్చారు
కుంటిసాకులెన్నో చూపి
కుటుంబాలు పాలించ .... //నిజము//
పేరుకు ప్రజాస్వామ్యం
పెత్తనమంతా కోటరీలదే
ఒక్కరికే లక్షల కోట్ల జీతాలు
రెండు మూడు పెన్షన్లు ....
//నిజము//
నిజాలన్నీ నిప్పులైనా
చెలగాటం చేశారు ....
వజ్రోత్సవాల వసంతంలో
వాకిట నిల్చిన సత్యాలు .... //నిజము//
నగునూరి రాజన్న
No comments:
Post a Comment