చిత్ర కవిత
తేది 26-02-2022
శీర్షిక : శిక్షణల కవాతు
కవిత సంఖ్య : 96+13
క్రమశిక్షణల కవాతులతో
కార్యానుకూలతల స్వభావాలతో
దీక్షాదక్షతల చాతుర్యాలతో
కార్యసాధనా నైపుణ్యాలతో....
స్వీయ నియంత్రణలకు మార్గమై
సాటి మనిషిని సన్నుతించే
సంఘ హితం కోరే సమాజముగా
సానబెట్టిన వజ్రంగా మారు....
చిన్న మొక్కప్పుడు వంగితేనే
చిదిమి దీపం పెట్టుకోవచ్చు ....
వందల జీవితాల్లో వెలుగులు
ప్రసరింప జేయవచ్చు ....
కష్టాలలో కాకలు తీరి
కావడి బరువుల విలువలతో
సుఖాల సుందరతల
అవపోశనలకు అనుకూలమై
అన్నీ తీర్చుటకు ఆయత్తం .....
నేటి బాలలే రేపటి పౌరులై
బంగారు భవిష్యత్తుకు బాటలు
వేసే ... మార్గదర్శులుగా ....
ముందు తరాలను మురిపింప జేయు .....
నగునూరి రాజన్న
కరినగరము
No comments:
Post a Comment