మనసైన
తేది: 25-02-2022
శీర్షిక : ఇష్టాయిష్టాలు ....
కవిత సంఖ్య : 227
కష్టాల కడగండ్లు ఎదురైనా
కన్నీళ్ల సెలయేళ్ళు మళ్ళినా
ఇష్టాల చల్లగాలులు ...మల్లెల
పరిమళాలను వెదజల్లుతుంటాయి ....
బలవంతపు లింగాల బంధనాలు
భక్తునిగా ఏమాత్రం మార్చలేవు ...
ఇష్టపడి ఈదితే ....కొలనులే కాదు
జలసంధులనైనా జయించవచ్చు .....
అప్పుడప్పుడు తల్లితండ్రులు
అనుకుని చేరుకోలేకపోయిన చదువులను
అంటగడుతుంటారు పిల్లలకు ....
ఆరునూరైనా అదే చదవాలంటూ ....
అక్కడక్కడా తారసపడుతుంటాయి
బలవంతపు చావుల ఆత్మహత్యలు
కష్టాలను అధిగమించే మనసు పెట్టక
ఇష్టాల బాటలో తాము పయనించలేక ...
పిల్లల ఇష్టాఇష్టాలు పిసరంత
తెలిసినా .... గౌరవించి సాగనంపితే ...
కష్టాలెన్ని ఎదురైనా ఇష్టంగా
మార్చుకుని.... కుసుమ వనాలను
ఘ్రాణిస్తూ దాటేస్తారు .....
నగునూరి రాజన్న
కరినగరము
No comments:
Post a Comment