అంశం : శివుడు
తేది: 28-02-2022
శీర్షిక : ద్వాదశ జ్యోతిర్లింగాలు
కవిత సంఖ్య : 96+14
శశి ప్రతిష్టేచ సోమనాథంచ
కృష్ణా నదీ తీర శ్రీశైలవాసా ...
క్షిప్రా నదీ తటే మహాకాళ
నర్మదా తటే ఓంకార మమలేశ్వరం ....
అమృతభాండే వైద్యనాథ
భీమనదీతీర భీమశంకరా ....
పర్వతవర్థినీపతే రామేశ్వరా
దారుకావనమున నాగేశ్వరా ...
వరుణ అసి నదుల సంగమ
నిలయా విశ్వనాథా ....
కొల్హాంబిక నాథా గౌతమీతటే
త్రయంబకేశ్వరా ....
హిమాలయ నిలయా
మందాకినీ తటే కేదారేశ్వరా ...
దేవగిరి మరాఠా నివాస
ఘృష్ణేశ్వరా ....
ద్వాదశ జ్యోతిర్లింగాల
తలంపే ... ఏడేడు జన్మల
పాపాలను హరించు ....
నగునూరి రాజన్న
కరినగరము
No comments:
Post a Comment