మాట గెలవని చోట
తేది 28-02-2022
శీర్షిక : మరో బాట….
కవిత సంఖ్య : 858
అర్ధబలం అంగబలమే అర్థరాజ్యం..
ధర్మం ఒంటరిదైన కలియుగంలో….
దగాకోరుల ధర్మ క్షేత్రంలో ఈనాడు….
అహాల నీడల్లో అలసటలు తీర్చుకోకుండా
మరో బాటైతేనే ... మారు మాటుండదు .....
మెత్తగా ఉంటే మొత్తబుద్దేస్తుందట...
అక్షరజ్ఞానాలు ఉన్న అధికారగణాలైనా
ఆత్మీయతలు నిండిన మానవత్వాలైనా
న్యాయధర్మాలను వల్లించే మహానుభావులైనా ....
న్యాయాన్యాయాలను సునిశితంగా
సమీక్షించగలిగి .... ధర్మాధర్మాలను
వివక్షలేకుండా చూపగలిగినా ....
ధర్మము దాపులేనిదైపోతుంది….
న్యాయం అన్యాయమైపోతుంది….
తాత్కాలికంగా….
సామదానభేద దండోపాయాలే కాకుండా
గీతలో బోధనలా….అత్యవసరమైతే
ముల్లును ముల్లుతో తీసే ఉపాయం….
అశ్వత్థామ హతో హతః నరో కుంజరోలా….
జగన్నాటకంలో సూత్రధారిలా
జీవన గమనంలో పాత్రధారులమై
జగజ్జంత్రీలకు అడ్డుకట్టలై నిలవాలి
భాజాభజంత్రీలు వాయిస్తూనైనా ... ...
నగునూరి రాజన్న
కరినగరము
No comments:
Post a Comment