ఇష్ట కవిత
తేది : 20-02-2022
శీర్షిక : వీర శివాజీ
కవిత సంఖ్య : 96+11
భరతమాత ముద్దుబిడ్డ
భవానీ వర పుత్రుడు
జిజా షాహాజీల కన్న బిడ్డ
శివాజీ నామధేయుడు…
పెళ్ళయాక మెట్టినింటా
వలసవాద వత్తాసుల
సాకులన్నీ వినీ వినీ..
విసిగిన జిజాభాయి
వీరమాతే అయ్యింది
శివైపార్వతి ఇష్టదైవంగా
శివాజీని మలిచింది ...//భరతమాత//
ఆదిగురువు అమ్మగా
ఆలోచనలకంకురమై
అవపోశన పట్టాడు
భారత రామాయణాలు ....
వీరత్వం రంగరించె
వీరమాత ... శివాజీకి
కరుణించి ఖడ్గమిచ్చే
కాళికాంశ భవానీ .....//భరతమాత//
దద్దరిల్లె యుద్ధరీతి
గెరిల్లా మెరుపుదాడులు
యుద్ధమంటె సన్నద్ధం
భరత జాతి పులిబిడ్డ ....
వందల సంగ్రామాలు
వరుసనందె విజయాలు ....
సంద్రపు అలలవోలె
సై అంటూ...పైకెగిసే ....//భరతమాత//
పొరుగులతో పొసగకున్న
పోటిలేదు పాలనలో…
పరమతాల ప్రముఖులే
పదాధికారులు పటాలంలో….
పరమత సహనంలో
ప్రణమిల్లి నిలిచాడు
పరాయింటి ఆడపడుచు
మాతృమూర్తి సమమనెను ....//భరతమాత//
శత్రువుల గుండెల్లో
శతఘ్నులు ఫిరంగులే ...
వెనుకంజ వేసేటోళ్లు
వెన్నెముకలో వణుకుపుట్టి ….
ప్రజలంటే ప్రాణమోలె
పాలించిన ప్రజ్ఞుడు...
హిందువంటే సింధువని
సింహంలా గర్జించే ….//భరతమాత//
నగునూరి రాజన్న
కరినగరము
No comments:
Post a Comment