నీతి నిజాయితీ
తేది: 02-03-2022
శీర్షికః నేతి బీరకాయ చందం ....
కవిత సంఖ్య: 110+1
ధర్మం ఒంటరిదైందని
దమన నీతి జడలు విచ్చుకుని
దరహాసాలు వెలగబెడుతూ
దర్జాలు ఒలకబోస్తూ కులుకుతున్నది ......
కలియుగంలో నీతి నిజాయితీ
అంటే అంతా నేతి బీరకాయే
మాటలతోనే మసాల వంకాయ
వండే రకాలు…తడిక చాటయితే
చాలు…చాడీల పచ్చళ్ళు నూరుతారు….
యథా రాజా తథా ప్రజా అన్నట్టు
తెల్లవారితే నమ్మకం లేని నాయకగణం...
పాలకులన్నా ... ప్రజలన్నా ....
పట్టింపు లేని అధికారగణం ....
దీపముండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలనో
ఏమో .... ఎవరికీ వారే యమునా తీరే ....
తమ తమ స్థాయిలలో తన్నుకు
చస్తున్నారు... వీధి కౌన్సిలర్ నుండి
విశ్వ నాయకుల వరకు ఇదే వరస ....
విడమరిచి చెప్పినా వినేవారే లేరు ....
ప్రజలపైన పావురాల ప్రేమలు లేవు...
పస్తులుండైనా ప్రజలు కట్టే పన్నుల పైన తప్ప ....
స్వయంపాకాల చక్కదనాలతో
పొదుగులు పిండుకుంటున్నారు ....
అందినన్నాళ్లు అధికారపక్షంగా ....
అందకపోయినా .. ప్రతిపక్షంగా ....
వంతులవారీగా అధికారం పంచుకుంటూ
వటవృక్షాలై పాతుకు పోతున్నారు ....
అవినీతి అన్యాయం అధర్మాలను
అక్కున చేర్చుకుని అనతికాలంలోనే ....
.
పదిరకాల ఫలహారాల పర్సెంటేజీలలో
అత్యల్ప పెద్దభాగమే అధికార దర్పం
వెలగబెట్టినట్టు .... ఎదురులేదు వాళ్లకి ....
ప్రజలంతా ఒక్కటైతే తప్ప పట్టు కుదరదు ...
No comments:
Post a Comment