Thursday, August 4, 2022

శివరాత్రి తేది: 28-02-2022 శీర్షిక : శివోద్భవం

 శివరాత్రి 

తేది: 28-02-2022
శీర్షిక : శివోద్భవం 
కవిత సంఖ్య : 228

మాఘ బహుళ చతుర్దశిన 
మహాదేవుని ఉద్భవము ... 
మానవ కల్యాణానికి 
మహోన్నతం పూజనీయం .... 

మారబోవు కాలానికి 
మన తనువుల సమాయత్తం  
మనమంతా పాటించే 
శివరాత్రి జాగరణం ..... 

శైవ క్షేత్రాలన్నింటిలో 
భవ్యమైన అభిషేకాలు 
అలంకరణలు... కల్యాణాలు ... 
శశిధరునికి నిశిపూజలు .... 

తమపర బేధం చూపక 
అడిగిన వరములనెల్ల 
అసురలకైనా ఒసిగిన 
ఆది శంకరుడవయ్యా ..... 

చెంబుడు గంగకే 
పొంగిపోయేవు నీవు....  
వీశెడు మారేడు పత్రికి 
దోశడు వరములినిచ్చు 
మా  రేడువయ్యా  ..... 

భక్త సులభుడవని కొలిచెద 
భవ సుందరుడవని తలిచెద 
భీమ శంకరా సహ్యాద్రి వాసా  
బోళా శంకరా మము బ్రోవరా.... 
 
నగునూరి రాజన్న 
కరినగరము 

No comments:

Post a Comment