Friday, August 5, 2022

గెలుపు తేది : 03-03-2022 శీర్షిక : వెలుగుపూల దండ

 గెలుపు

తేది : 03-03-2022
శీర్షిక : వెలుగుపూల దండ
కవిత సంఖ్య : 232

గెలుపోటములు దైవాధీనములైనా  
చీకటి వెలుగులై దోబూచులాడు .... 
గెలిస్తే క్షణకాలం గమ్మత్తు 
ఓడి ఓడి..గెలిచిన మజా మరువలేనిది ..... 

ఎన్నిసార్లు ఓడిన కష్టాన్నైనా ....
ఒకే ఒక్క నిమిషంలో సంతోషంగా 
మార్చగలిగే మహత్వపూర్ణ టానిక్కు 
మనల్ని మనమే నమ్మలేని మ్యాజిక్కు ..... 

తప్పొప్పుల విశ్లేషణలు తరచుకుని 
తగిన సవరణలకు పూనుకుని...  
విజయ సోపానాల ప్రణాళికలతో 
అనువైన అమలుతో వీర విహారం చేయాలి .... 

కృషి పట్టుదలలతో ముందుకు సాగాలి 
సాధించాలనే కోరికతో మనం రగలాలి 
కాలాన్ని గుప్పెట బంధించి శాశించాలి 
వీలైన అన్ని దారులు శోధించాలి .... 
ప్రతి నిమిషం దానినే శ్వాసించాలి…..

దాగుడు మూతల తటాపటాయింపులు 
దాటుకుని… విజయం తలుపులు తట్టి 
తనంతట తానై వరించదా…వెలుగుపూలతో
మెడలో దండలు వేసి గెలుపు వరిస్తుంది… 

నగునూరి రాజన్న 
కరినగరము 

No comments:

Post a Comment