ఉగాది
తేది: 02-04-2022
శీర్షిక : కాల గణనం
కవిత సంఖ్య :
అనుభవాల పూతోటలో
అమృతగుళికల మకరందం
ఏరుకున్న మానవుడు...కాలంతో కలిసిన
పయనమే విజయ తీరమని తెలుసుకున్నాడు .....
గతాలను ఆసరాగా చేసుకుని
వర్తమానాలను సరిచేసుకుంటూ
భవిష్యత్తుల బాటలు తీర్చి దిద్దుకునే
క్రమమే కాల గణనాల కసరత్తు .....
అల్లన తిరిగే అవని సోదరుడు
చల్లని మూర్తియైన చంద్రుని
చల్లని మూర్తియైన చంద్రుని
భ్రమణ కాలాన్ని... నక్షత్రముల
ఆధారము చేసి... అనుభవంతో జోడించె ...
నిశిరాజు కదలికలతో ... నక్షత్రాల
గమనాలతో పక్షం మాసం లెక్కించి
ఘడియ విఘడియల ఖండికలతో
తిథి వార నక్షత్రాలను తిరగేసాడు .....
దినకరుని గమనాలతో ... రుతువులు
అయనాలుగ .. పక్కాగా లెక్కించి
పంట పొలాల దిగుబడులను
పదిలం చేయ ముందే పసికట్టేవాడు .....
తిథి, వార, నక్షత్ర, యోగ, కరణములే
"పంచ" అంగములని ప్రసిద్ది పొంద ...
గ్రహ సంచార విభజనలనే రాశులుగా వర్ణించి
గ్రహ సంచార విభజనలనే రాశులుగా వర్ణించి
కాల గమనమునకు కలిగి ఉన్న
సంబంధాలు ఔపోషణ పట్టే ...
సంబంధాలు ఔపోషణ పట్టే ...
ఆరోగ్య సంపదలను అనుకూలమై
ఒడిసి పట్ట ...కాల గమన ప్రమాణాలు
స్థిరీకరించి ... పంచాంగ శ్రవణం
పద్దతిని ప్రవేశ పెట్టారు ....
నగునూరి రాజన్న
కరినగరము
No comments:
Post a Comment