Thursday, August 4, 2022

మధురవాణి తేది: 24-02-2022 శీర్షిక : మధురమైన మాట

 మధురవాణి

తేది: 24-02-2022
శీర్షిక : మధురమైన మాట 
కవిత సంఖ్య :226

మచ్చలేని అచ్చులతో 
ఎల్లలెరుగని హల్లులతో 
మూడు ఉభయాక్షరముల
ఆరు కాలాలు వర్ధిల్లే మాతృ భాష .... 

పాలు మీగడలకన్నా 
తేనె ధారలకన్నా  
మధురమైనది మన 
మాతృభాష ...సుందరమైన 
సుమధుర భాష .... ఆలకించు 
అమ్మ లాలి పాటలు .... 

అమ్మ నేర్పిన మొదటి మాట 
అమ్మ భాష కన్న ఏముంటది 
అవనిలోన మధురం .... అందుకే 
అమ్మభాషే అతి మధురమైన వాణి .... 

తంజావూరు ఆస్థానంలో 
తల పండిన విదుషీమణి 
అరఘడియలో వంద శ్లోకాలు 
ఆరు భాషల్లో అనర్గళమైన 
కవిత్వం చెప్పిన .. శుకవాణి 
కూడా మధురవాణే . 

అంతే కాదు  ..... 
నవయుగ వైతాళికుడు 
సంఘ సంస్కర్త 
సద్గుణ సంపన్నుడైన కవి 
సాంఘీక దురాచారాలను 
ఎన్నింటినో సృశిస్తూ ... 
సంఘ హితం కోరి సంధించిన 
మృదుస్పర్శల నేమలీక ....  
కన్యాశుల్కంలోని పాత్ర కూడా .. .  

కానీ ..... 
స్వార్థపరుల  చేతుల్లో
సలసలా నలిగిపోయి 
మొరటు తనాలతో 
ప్రదర్శనా నిషేదాల  
పాల్పడేదాకా తెచ్చిన 
సకిలింపుల మాటలు  ... 
ఇకిలింపుల పదాలు కానే కావు .. 

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment