తారుమారు
తేది: 10-03-2022
శీర్షిక : చిత్తు బొత్తు
కవిత సంఖ్య : 234
నాగరికతలో అడుగులేసిన
జనులంతా .... పారిశ్రామికీకతలో
పరుగు లంఘించుకున్నారు ...
పక్కవారిని కూడా పట్టించుకోలేనంత ....
ఆత్మీయతలు పంచాల్సిన
అమ్మానాన్నలు సైతం
పని రాక్షసులతో కుస్తీలు
పడుతూ ... పిల్లల పెంపకంలో
ఉదాసీనతలు ప్రదర్శిస్తున్నారు ...
అడిగినవన్నీ అలవోకగా
సమకూరుస్తూ ... ఆలన పాలనలు
అద్దె తల్లులకు అప్పగిస్తూ ...
అనురాగాలకు తెరలు వేస్తున్నారు ...
అప్పనంగా వచ్చిన ఆకర్షణీయమైన
వాహనాలపై పరుగులు తీస్తూ
ప్రత్యామ్నాయాలకు ఆకర్షితమై
పసందులను తీర్చుకుంటున్నారు .
భవబంధాల గందరగోళమెరుగని
బాధ్యత భావాలెరుగని యువత
రక్షణ పాటించక రయ్యిమంటూ
స్వీయనియంత్రణలు పాటించక
వాయువేగాల పయనాలలో ...
అటు ఇటైతే .. జీవితాలన్నీ
తారుమారె .. కుటుంబాలన్నీ
కుదేలే ... బతుకుబండి చిత్తు బొత్తే
నగునూరి రాజన్న
కరినగరము
No comments:
Post a Comment