మాయ
తేది: 18-03-2022
శీర్షిక : ఇంటోన్నీ కొట్టే వీరత్వం ...
కవిత సంఖ్య : .
తెల్లోని మాయ కప్పి
తెలివంతా గంగలో కలిసింది ...
అందులోంచి వర్ణాలేరుకుని
అవే సప్తవర్ణాల హోలీ అనే
అపోహలో ఉన్నారు ....
రాజ్యాంగం సమానమే అంటూ కపటత్వం
చాప కింద నీరులా కపట
చట్టాల చుట్టాలను వేరువేరుగా
చుట్ట చుట్టుకుంటూ వచ్చారు ....
ప్రసార మాధ్యమాలను
పాదాల కింద బిగపట్టి...
మాట వినని మల్లన్నలను
మట్టి కరిపిస్తూ వచ్చారు ....
నిఖార్సయిన నిజ దేశ భక్తులను
నిలువ నీడ లేకుండా చేసి
కోటరీల గోడలపై తాపీలతో
నున్నటి సున్నపు కోటింగులతో
కోటగుమ్మాలు నిర్మించుకున్నారు .....
మితవాదపు ముసుగులో దాగి
బోల్డు గుండెల అతివాదపు ఫవుజీ అయినా ...
పంటికింద రాయిలాంటి పదవి దానం
చేసిన వారైనా ...
గట్టి మనస్తత్వపు పొట్టి మనుషులైనా
నర్మగర్భపు చిరునవ్వుల చిత్తములైనా ....
గొప్ప గొప్ప శాస్త్రవేత్తలైనా....కాదంటే
కాముషుగా కాటికంపటాలే...
కాలు మీద కాలు వేసుకుని
కాశ్మీరు అందాలను తిలకించగా
కాయ కష్టమెరుగని రీతిన
కంచములోకి పంచభక్ష్య
పరమాన్నాలు వస్తుంటే...
అయ్యవ్వల కష్టాల అవసరాలు లేకుండా
ఆవగింజంత దెబ్బ తగిలినా ఆమ్మో ....
అనే హరిగోసల రోదనలు లేకుండానే ...
అందుతుండే ఐదేళ్లు నోట్లోకి
రోటి సబ్జీ బంగారు కంచంలో .....
తప్పుడు చరిత్రలన్నీ పోగేసి
తరాజులో పోసినట్టు చేసి...
ఇదే న్యాయం ధర్మమన్నారు ....
అధికార మద బలాలతో .....
ఆత్మ సాక్షులను అటకెక్కించి
కుంటి సాకులతో ... కుటిల
రాజకీయాలు చేస్తున్నారు
కొంతమంది ....ఓటు బ్యాంకుకై ...
చరిత్రలు తిరగ తోడండి
రంగులెన్ని ప్రదర్శించి
రాద్ధాంతలెన్ని జేసినా
రాగాలెన్ని తీసి గానాపనలైనా ....
రక్షణల కోసమే గాని ...భక్షణ
చేసే ప్రవుత్తుల పైత్యమే లేదు...
రాక్షసక్రీడల మూలాలన్నీ
రాచబాటలై చూపిస్తాయి ....
మన పాలనలుంటేనే ప్రజలంతా
క్షేమము ... దేశము సుభిక్షము ....
నగునూరి రాజన్న
No comments:
Post a Comment