మహిళా చైతన్య గీతం
తేది: 05--3-2022
శీర్షిక : ప్రశ్నించు ....
కవిత సంఖ్య : 863
నారీ ! నవ్య మహారాణీ
మోగించవే యుద్ధభేరి .....
ఆత్మీయతలో అమ్మనని
అనురాగంలో చెల్లినని
ఆదర్శములో ఆలినని
అందరెరిగిన అతివనని ....
// నారీ //
వంటిల్లె వైకుంఠమన్న
వామన మూర్తులకు....
ఆకాశమే హద్దని తెలిపే
ముద్దుగుమ్మలెందరోనని .....
// నారీ //
మమతెఱిగిన మాతలుగా
గురి కుదిరిన గురువులుగా
బరిలో దిగితే బాక్సర్లుగా
ఆకట్టుకునే క్రికెటర్లుగా
// నారీ //
ప్రాణం నిలిపే వైద్యులుగా
సైన్యం నడిపే శక్తులుగా
శిక్షించే రక్షకభటులుగా ....
అది ఇదను తేడానే లేనేలేదని
// నారీ //
విజ్ఞానంలో శాస్త్రవేత్తనని
వినువీధుల్లో వ్యోమగామినని
నవ్విన నాపచేనే
దండిగా పండినదని ....
నగారా మోగించవే
// నారీ //
అయినా అయిపులేని
ఊరించే అర్ధభాగాలంటూ
ప్రశ్నించలేని మెతకతనమొదిలి
ఇంకా మీ పెత్తనమేంటంటూ ...
// నారీ //
నగునూరి రాజన్న
కరినగరము
No comments:
Post a Comment