ఎగిసిపడే ఉత్సాహం
తేది : 23-02-2022
శీర్షిక : యువతే దేశ సంపద
కవిత సంఖ్య : 855
ఉరుకులు పెట్టే ఆలోచనలన్నీ
ఉప్పొంగే జలపాతములే
యుక్త వయసులో అందరికి ....
నిర్వీర్యం చేయని యువతలో
నిండుగా గోచరించేది అదే ....
మండుటెండలు సైతం
మంచు కురిసే వేళ అవుతుంది....
చలి పులి కూడా పారిపోయి
ఛాతీ విచ్చుకుంటుంది ......
పేదరాశి పెద్దమ్మ ప్రేరణలు
కొండనైనా ఢీకొట్ట గలిగే తత్వాలను
సమకూర్చి .... స్వీయ నమ్మకాలను
ద్విగుణీకృతం చేసి .... విజయాల
బాటపై వీర విహారం చేయిస్తాయి ....
యవ్వనాల కోరికల చిట్టాలకు
విజ్ఞానాల వీచికలు తోడవుతూ
అనుభవాల అడుగులు జోడిస్తే ...
విజయ బావుటాలు ఎగిరేయవచ్చు .....
దేశానికి యువతే వెన్నెముకని
గుర్తించిన శత్రు దేశాలు
మత్తుల్లో గమ్మత్తులున్నాయంటూ
ఎరవేసి నిర్వీర్యాలు చేయకుండా
పౌరసమాజం చేతులు కలపాలి
పాలకులు వత్తాసు పలకాలి .....
దేశ సౌభాగ్యాన్ని కాపాడుకోవాలి.
నగునూరి రాజన్న
కరినగరము
No comments:
Post a Comment