Friday, August 5, 2022

శివోహం శివోహం తేది: 01-03-2022 శీర్షిక : శివ శివ నీవే ....

 శివోహం  శివోహం

తేది: 01-03-2022
శీర్షిక : శివ శివ నీవే .... 
కవిత సంఖ్య : 859

మహాశివరాత్రి మహోత్సవం 
నదీ తీరాలన్నీ నాదమయం .... 
గంగ స్నానాలు గౌరమ్మపూజలు 
మార్మోగుతున్నాయి ఓంకారంతో.... 

భక్తజనులతో క్రిక్కిరిసిపోతున్నాయి ... 
జనంతో కిటకిటలాడుతున్నాయి .... 
మందిరాలన్నీ మానవాళితో .... 
రెండు కళ్ళు చాలని సుందర దృశ్యం ....  

మహాన్యాస రుద్రాభిషేకాలు 
అభిషేకాలు అలంకరణలు..... 
పంచామృతాలతో ఫలపుశ్పాదులతో  
శివనామస్మరణల శివోహం అంటూ .... 

చెంబుడు గంగకే చెంగున వరం 
గుప్పెడు దళాలకే గంపెడు కోరికలు 
రుద్రం , నమకం , చమకంలతో 
భద్రం చేయును మన బతుకులు ..... 

త్రిలింగ  దేశంగా తీర్చి దిద్దిన 
శ్రీశైల మల్లిఖార్జునుడు    
ద్రాక్షారామ భీమేశ్వరుడు  
కాళేశ్వర ముక్తీశ్వరుడిగా....   

ద్వాదశ జ్యోతిర్లింగాలలో 
దర్శనమిస్తూ కరుణించి 
ప్రజలందరినీ కాపాడే 
కాశీ విశ్వనాథుడే ..... 

పాండవుల పూజలందుకున్న 
కేదారీశ్వరా కరుణించరా .... 
జలరూప నివాస జంగమదేవరా... 

అలౌకికానందాల నిలయా 
అమర్ నాథ్ లో మంచురూపమైనా ... 
బంగారు వర్ణాన భలే కాంతులు 
వెదజల్లే కైలాసపర్వత రూపమైనా ...   
మానస సరోవర విహారా 
మా మొరలు వినగా రావయ్యా .....  

నగునూరి రాజన్న 
కరినగరము 

No comments:

Post a Comment