కలల సాకారం
తేది: 10-03-2022
శీర్షిక: ఆశ , ఆశయం
కవిత సంఖ్య: 110+4
ఆకలి దప్పుల్లాగే పేదగొప్పల
భేదమెరుగవు కలలు కూడా ....
అందరి మనసులలో కలిగే
ఆలోచనల తరంగాలకు ఆకృతి ....
మనుషులకు పరిధులు కానీ..
మనసుకు లేనే లేవు ఎల్లలు...
ఎక్కడికైనా పయనించవచ్చు ...
ఏదైనా ఆశించవచ్చు ...
మనసున బీజం పడితే
మననం సాగి పోతూనే...
మార్గాన్వేషణ వెతుకులాటలు ...
ప్రణాళికల రూపకల్పనలు ...
అమలుకు అంకురాలు
కృషి పట్టుదలల పెట్టుబడులు
దీక్షా దక్షతల ప్రదర్శనలు
పదిమంది మెచ్చే ఫలితాలు .....
ఆశ మనిషికి గమనం నేర్పిస్తే
ఆశయం గమ్యం చూపించి
అడుగులేయిస్తుంది .... మంచికి
పేరుప్రతిష్టలు తెచ్చి పెడుతుంది ....
గుంభనమై గుర్తించుకున్న
గురి కుదిరే దాకా దృష్టి సారించాల్సిందే ....
కలల సాకారం చేసుకోవాల్సిందే .....
నగునూరి రాజన్న
No comments:
Post a Comment