Thursday, August 4, 2022

మాతృభాషా దినోత్సవం తేది : 21-02-2022 శీర్షిక : బహుపాత్రలు .....

 మాతృభాషా దినోత్సవం

తేది : 21-02-2022
శీర్షిక : బహుపాత్రలు ..... 
కవిత సంఖ్య : 96+12

అమ్మ పొత్తిళ్ళలో ఆలపించి 
అనురాగం పెంచుకున్న భాష 
నాన్న భుజాలమీద నుండి 
పదసంపదలు పెంచుకుని ..... 

భాషా భాగాల నగిషీలు చెక్కుకుని 
అందాలొలికే అలంకారాలతో 
సుందరాల ఛందస్సుతో ... 
గురు బోధనల పదునుపెట్టుకున్న
గుమ్మపాల రుచి నా తెలుగు .... 

ముచ్చటైన మూడు లైన్ల హైకూలు 
నజరానాగ నాలుగు లైన్ల నానీలు 
అందమైన ఆరులైన్ల రెక్కలు 
అమ్మమ్మల  తాతయ్యల కథలు , 
కథానికలు.... 

బహుపాత్రల నాటికలు 
నాటకాలు .... సంక్షిప్తత 
సరళత స్పష్టతల వచన కవితలు 
ఆనందాలు పంచి అలరించే 
అనేక రకాల గేయాలు గీతాలు ...... 

రవీంద్రుని వలె ఏకవాక్య కవితలు .... 
ద్విపదలు….వైవిద్యపు అవధానాలతో.... 
తెలుగు వనమంతా విరిసిన 
సంబరాల సాహితీ సేద్యం 
బహు సుసంపన్నం ... 

వింతగొలిపే విభిన్న రకాల 
తెలుగు సాహితీ వనం ... 
ప్రతి దినము పరితపిస్తే గాని 
పదిలం కాదు .... 

భాష ఎంత గొప్పదైనా .... 
ఎదురు లేనిదౌతుంది ... 
పాలకుల పరితపనల దన్ను 
తోడై ...ప్రజల మన్ననలు పొందితే .... . 

నగునూరి రాజన్న 
కరినగరము 

No comments:

Post a Comment