ఉగాది గేయం
తేది : 02-04-2022
శీర్షిక : శుభకృత్ పూదోట
కవిత సంఖ్య: 882
స్వాగతాలు స్వాగతాలు
నవ వసంత మాలకు
మనసారా స్వాగతాలు
శుభకృత్ పూదోటకు
కాలమే కామధేనువని
అనుభవాల సారము
కర్తవ్యాలే పూజనీయమని
తెలిపెకదా పూజ్యులు…. //స్వా //
తెల తెలవారగనే కళ్ళాపి
తెల్లపిండి రంగవల్లులతో
తెలుగువారి లోగిళ్లు
కళకళ లాడుతుంటే …. //స్వా //
అంచు చీరలాభరణాల
ఆంగనల కోలాహలం
రకరకాల పిండివంటల
రంజిల్లు గృహసీమలు ... //స్వా //
ఋుతువు సంధి కాలాలను
బతుకు తీర్చ ఒడిసిపట్టు
తీపి చేదు పులుపు వగరు
ఉప్పు కారం ఓషధులతో…. //స్వా //
నవ వసంతమై వచ్చింది
కొత్తచిగుళ్ళు తరువులకు
కొండంత పరవశాలు
కలకూజిత రాగాలు… //స్వా //
కోవెలలో దర్శనాలు
కోటి ఆశల పల్లవులు
పంచాంగ శ్రవణములు
ప్రణాళికల పట్టములు… //స్వా //
కాలగణన చైతన్యంగ
కదిలింది మానవాళి
అనుభవాల సారాలను
ఆదరించి నిలిచింది…. //స్వా //
నగునూరి రాజన్న
కరినగరము.
No comments:
Post a Comment