ఆ నడక దారుల్లో
తేదీ : 04-07-22
శీర్షిక : మకుటాయమానం ....
కవిత సంఖ్య : 927
ఇరుగు పొరుగుల బాధలలో
ఇసుమంత ఆపన్న హస్తమై
అందరు బాగుండాలి ... అందులో
నేనుండాలనే అమ్మ తత్వంతో ...
పిక్కటిల్లే బాధల బందీలలో కూడా
చెక్కు చెదరని చిరునవ్వుల తోవ
గుక్క తిప్పుకోలేని దిక్కుల జాడల్లో
ఒక్కడై నిలిచిన ధైర్యపు క్షణాల నాన్నగా ...
అజ్ఞాన తిమిరంలో అలమటించే
బాల్యానికి ఆసరా దీపమై ... జ్ఞాన
జ్యోతులు వెలిగించిన ఎంతో మంది
గురువుల త్యాగ ఫలితాల చిరునామాగా ....
దాస్య శృఖలాల చెర నుండి మాతృ
భూమిని స్వేచ్చా వాయువులతో
మనకందించిన మహానుభావుల
మనుగడ చరితల అడుగుజాడలలో....
అనంతమైన పట్టుదల అశేషకృషి
ఆధారభూతమై... మహాఋషులు
మనకందించిన తరతరాల తరగని ఆస్తి
ఆధ్యాత్మికత మార్గాలే .... జీవితాన
మకుటాయమానం ....
నగునూరి రాజన్న
No comments:
Post a Comment