చిత్ర కవిత
తేది: 17-06-2022
శీర్షిక : జీవితచక్రం
కవిత సంఖ్య : 137+7
అందమైన మనిషి జీవితం
అంతా చిత్ర విచిత్రమయం
వయసులతో కొలతలేసి
కాలాలతో కబడ్డీ ఆడేస్తుంది…
బాదర బందీలు లేని బాల్యం
బాతాఖానికి బహు సుందరం ....
చిత్రంగా మిత్రులతో అల్లుకు
పోతారు ...ఒకరికొకరై అందరు .....
మాటల తోటలో లీనమైనా... సరే
బాల్యంలో అమ్మాయిలకమ్మాయిలే
అబ్బాయిలకబ్బాయిలే కలిసి జట్టు
మాటలు కలిపే మంచి మతులబులకు .....
ఊహల పల్లకిలో ఊరేగే సమయాన
చిలిపి వర్ణాల చిత్రమైన యుక్త వయసులో
లుప్తమెరుగని సప్తవర్ణాల ఇంద్రధనస్సును
తలపోస్తూ మసిలేది యువతరంలో ఒక ఆడమగ…
బాధ్యతల బరువులు దించుకునేసరికి
విధి నేనున్నానంటూ వెక్కిరించి… తోడు
లోని నీడను లాక్కెల్లగానే… ఒంటరి పక్షిలా
కూర్చుని ఒడువని చిరిత్రలను వల్లె వేసుకును…
ఇదేకద ఎవరిదైనా జీవిత చక్రం …
ఇగురంగా ఆలోచిస్తే ఇహంపరం….
నగునూరి రాజన్న
No comments:
Post a Comment