విశ్వ జననీ వాసవీ
మా హృదయ గీతి అందుకో
నిత్య పూజ సత్య సింధు
ఆత్మ హారతి అందుకో .....
కలం పారగ గళం సాగగ
తీవ వేనియ మ్రోగగా // విశ్వ//
సౌహార్ద ఆర్ద్రత నిండగా
స్నేహ దీపం వెలుగొందగా
సహకారబంధం నిలువగా
ప్రగతి పుష్పం విరియగా // విశ్వ //
భక్తితో నిను గొలుతుము
విశ్వ శాంతికి నిలుతుము
విశ్వ జననీ వాసవీ
మా హృదయ గీతి అందుకో
నగునూరి రాజన్న
No comments:
Post a Comment