ప్రజా చైతన్యం
తేది : 10-07-2022
కవిత సంఖ్య :
రాతిగుహల జీవితం
చైతన్యపు గమనం
రాజుల కాలాలను
అధిగమించిన చైతన్యం ...
ప్రజాస్వామ్యాలుగా
ఫరిడవిల్లిన వైనం
లెక్కలేని కష్టాలకు
మొక్కవోని దక్షతలు
పాకులాడి పాకులాడి
పాలకులౌతున్నారు
సామాన్యుల పొట్టకొట్టి
సాధించ సంపదలను ....
అధికారపక్షం ప్రతిపక్షం
పంతంపట్టి వంతులవారీగా
పోటీలు పడుతున్నాయి
లూటీలు చేయడానికి ప్రజల్ని…
దండుకున్న సంపదలు
దక్కనీయని పరిస్థితులే
ప్రజాగ్రహాల జ్వాలలకు
పేకమేడలు తలపిస్తుంటే ...
చరితలన్నీ తిరిగేసైనా
త్వరిత గతిన మారండి
పారిపోయే పానాలకు
చేరిపోవునా సంపదలు...
జగతికంత చాటినాము
భగ్వద్గీత సగర్వంగా
ఆచరణలో ఎందుకింత
అలసత్వం ప్రదర్శన ....
సింహళమే ఉదహరణ
సింహభాగం ప్రజలని
పాలకులు ఇకనుండైనా
పాటిగా గుర్తించాలి ....
అధోగతికి చేరువగా
అదేగతి కావాలంటే …
అవకాశం మీచెంతనే
అమీతుమీ తేల్చుకొండి ...
నగునూరి రాజన్న
No comments:
Post a Comment