ప్రత్యేక కవిత
తేది: 19-11-2021
శీర్షిక: ఝాన్సీ కా రాణి
కవిత సంఖ్య: 190
మరాఠా కుటుంబంలో జన్మించిన
మరకతమణి మన మణికర్ణిక …
గంగాధర్ రావు నేవల్కరును పెళ్ళాడి
ఝాన్సీ లక్ష్మీబాయిగా ప్రసిద్ధి పొందింది...
యుద్ధవిద్యల్లో ఆరితేరిన పులిబిడ్డ
సమయానుకూలంగా క్లిష్ట పరిస్థితులను
సైతం ఎదుర్కొని…పోరాట పటిమలు ఎన్నో
చూపి వెన్నుచూపని గొప్ప వీర వనిత ….
స్వార్థమెరుగని స్వాతంత్ర్య సమర
యోధురాలు...నమ్ముకున్నోళ్లకొరకు
నరకప్రాయమైనా... ఆనందంగా
బాధ్యతలు భుజానికెత్తుకున్న ధీశాలి ....
స్వదేశీయులను సంఘటిత పరచడంలో
సఫలీకృతురాలై… మహిళా దళాన్ని పోగుచేసి
స్వాతంత్ర్య పోరాటంలో సమున్నతముగా నిలిచి...
తెల్లోడి గుండెల్లో రైళ్ళు పరుగెత్తించిన ధీరురాలు
అతివలంటే అబలలు కాదని
మహిళలు కూడా మహారాణులేనని
ఆచరణాత్మకంగా అమలుపరిచి
ఋజువు చూపిన మార్గదర్శి ....
మరణాన్ని కూడా ఆత్మీయంగా పలకరించి
అలుముకున్న అత్యంత సాహసవంతురాలు.
ఆమె మననము మనకు రోమాంచితము…
దేశమంటే దేహన్నే అర్పించిన ధీరవనిత…
నగునూరి రాజన్న
No comments:
Post a Comment