చదువు విలువ
తేది : 13-06-2022
శీర్షిక : చక్కబెట్టేంత
కవిత సంఖ్య : 137+6
ఏమి లేనప్పుడే ఎంతో ఎక్కువ
జీవరాశికన్నా మానవాళి అనే
భావం మనందరిలోన అంతఃకరణంగా
నిబిడీకృతమైన నిధి మర్మం...
హాలికుని చేతుల్లోంచి అలవోకగా
అవని మాత గర్భంలోకి జాలు వారిన
విత్తనంలా...అక్షర బీజాలను వంపుకున్న
మానవ మేథ....
తొలకరితో పులకరించి విచ్చుకుంటూ
మట్టి పొరలను తట్టి లేపే
మహిమాన్వితాలుగా... మారాకులు తొడిగి
మనుషుల మనసులకు ఆహ్లాదాలను
పంచినట్టు.... ఆకలి దప్పులను
తీర్చే నెచ్చెలిలా .....విజ్ఞానాల వికసించిన
మనసు కూడా అందరు బాగుండాలి
అందులో నేనుండాలి అనే హాలికుడైతాడు ....
వ్యక్తిగతంగా తీర్చి దిద్దుకునే అవకాశాలను
కల్పించి .... కుటుంబపరంగా ఆత్మీయతలను
ఆప్యాయతలను పెంపొందింపజేస్తూ...
సంఘ పరంగా మంచి చెడుల మహిమాన్వితాలను
న్యాయాన్యాయ విచక్షణలను వివరిస్తూ
సంతులనాల సమతుల్యతలు
పాటిస్తూ అన్నింటా చక్క బెట్టేంత శిఖర
స్థాయిలో మనిషిని నిలబెడుతుంది .....
నగునూరి రాజన్న
No comments:
Post a Comment